Google: 'జోకర్' దెబ్బకు 11 యాప్ లను తొలగించిన గూగుల్

  • యాప్ ల ద్వారా ఫోన్లలో ప్రవేశిస్తున్న 'జోకర్' మాల్వేర్
  • యూజర్ల ప్రమేయం లేకుండా డేటాలో మార్పులు
  • యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్
Google removes eleven apps from play store that contained joker malware

ఇటీవల కాలంలో యూజర్ల భద్రతకు సవాల్ గా మారిన అనేక యాప్ లపై గూగుల్ కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర 'జోకర్' మాల్వేర్ ఉండడమే గూగుల్ నిర్ణయానికి కారణం. 'జోకర్' మాల్వేర్ ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల ప్రమేయం లేకుండానే డేటాలో మార్పులు, చేర్పులు జరుగుతాయి.

ప్రీమియం సర్వీసులను కూడా తనంత తానుగా సబ్ స్క్రైబ్ చేసుకుని యూజర్లను దిగ్భ్రాంతికి గురిచేయడం 'జోకర్' మాల్వేర్ ప్రత్యేకత! కొన్నిసార్లు 'జోకర్' ను గుర్తించడం గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ వ్యవస్థలకు కూడా సాధ్యం కాదని చెక్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఏజెన్సీ వెల్లడించింది.

గూగుల్ తొలగించిన యాప్ లు ఇవే..

  • com.imagecompress.android
  • com.contact.withme.texts
  • com.hmvoice.friendsms
  • com.relax.relaxation.androidsms
  • com.cheery.message.sendsms
  • com.cheery.message.sendsms
  • com.peason.lovinglovemessage
  • com.file.recovefiles
  • com.LPlocker.lockapps
  • com.remindme.alr
  • com.training.memorygame

More Telugu News