Renu Desai: నేను పెళ్లి చేసుకున్నా ఇబ్బందే.. చేసుకోకపోయినా ఇబ్బందే: రేణు దేశాయ్

Renu Desai response on her marriage
  • పెళ్లి ప్రశ్నలతో విసిగిపోయా
  • వీటికి సమాధానంగా ఒక సినిమా తీస్తా
  • దానికి 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతా
పవన్ కల్యాణ్ కు దూరమైన తర్వాత రేణు దేశాయ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు. దర్శకురాలిగా, రచయితగా బిజీగా ఉన్నారు. మరోవైపు రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన రెండో పెళ్లి గురించి ఆమె ప్రకటించి రెండేళ్లు కావస్తోంది. అయితే ఇంతవరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకురాలేదు. దీంతో, పెళ్లి విషయం గురించి నెటిజెన్లు ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

తాజాగా ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఆమెకు... ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమెకు అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె ఫన్నీగా సమాధానం చెప్పారు. అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని... తాను పెళ్లి చేసుకున్నా వారికి ఇబ్బందేనని, పెళ్లి చేసుకోకపోయినా ఇబ్బందేనని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలతో తాను విసిగిపోయానని చెప్పారు. వీటన్నింటికీ ఒక సమాధానంగా ఒక సినిమా తీస్తానని... దానికి 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతానని అన్నారు.
Renu Desai
Marriage
Tollywood

More Telugu News