ఇంట్లో మంటలు చెలరేగడంతో చిన్నారిని మూడంతస్తుల భవనం నుంచి విసిరేసిన తల్లి.. కాపాడిన ఫుట్‌బాల్ ప్లేయర్.. వీడియో ఇదిగో

10-07-2020 Fri 13:25
  • అరిజోనాలోని ఫినిక్స్ లో ఘటన 
  • ఇంట్లో మంటలు చెలరేగడంతో చిన్నారిని విసిరేసిన తల్లి 
  • బాలుడి ప్రాణాలు కాపాడిన ఫుట్‌బాట్‌ స్టార్‌ ఫిలిప్ బ్లాంక్‌
  • మరో బాలిక సేఫ్.. తల్లి మృతి
Man catches three year old dropped from burning building

తమ అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగడంతో, ఓ తల్లి తన మూడేళ్ల కుమారుడిని మూడో అంతస్తు ఫ్లాట్‌ కిటికీలోంచి కిందకు విసిరేసింది. దీంతో అక్కడ ఉన్న ఫుట్‌బాట్‌ ఆటగాడు ఫిలిప్ బ్లాంక్‌ ఆ బాలుడిని క్యాచ్‌ పట్టి ప్రాణాలు కాపాడాడు. అనంతరం ఎనిమిదేళ్ల కూతుర్ని కూడా రక్షించడం కోసం ఆ తల్లి ఇంట్లోకి వెళ్లింది. అయితే, దురదృష్టవశాత్తు తల్లి రచెల్‌లాంగ్‌ ఆ మంటల్లో పడి ప్రాణాలు కోల్పోగా, కూతురు మాత్రం బతికింది. ఈ ఘటన అరిజోనాలోని ఫినిక్స్ ‌లో చోటు చేసుకుంది.  

కాగా, గాయాలపాలైన ఆ బాలుడిని, బాలికను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఆటగాడు ఆ బాలుడిని కాపాడిన సమయంలో తీసిన వీడియో బయటకు వచ్చింది. ఆయన ఫుట్‌బాల్‌ స్కిల్స్ బాలుడిని కాపాడేందుకు ఉపయోగపడ్డాయని ప్రశంసల జల్లు కురుస్తోంది.