KCR: సచివాలయం వద్ద ఇప్పుడున్న వాటికన్నా విశాలంగా మందిరం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్

KCR response on temple and  masjid damage
  • సెక్రటేరియట్ కూల్చివేత పనులతో ఆలయం, మసీదులకు డ్యామేజీ
  • చాలా చింతిస్తున్నానన్న కేసీఆర్
  • ఆలయ, మసీదు నిర్వాహకులతో స్వయంగా భేటీ అవుతానని ప్రకటన
హైదరాబాదులోని పాత సెక్రటేరియట్ భవనాన్ని కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనుల వల్ల అక్కడ ఉన్న దేవాలయం, మసీదులకు కూడా ఇబ్బంది కలిగింది. దీంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సెక్రటేరియట్ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే ప్రభుత్వ నిధులతో ఇంతకన్నా పెద్ద దేవాలయం, మసీదులను నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.

సెక్రటేరియట్ భవనాలను కూల్చేస్తున్న సందర్భంగా పెచ్చులు, శిథిలాలు పక్కనున్న దేవాలయం, మసీదులపై పడ్డాయి. దీంతో, వాటికి కొంచెం డ్యామేజీ అయింది. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ... ఇలా జరగడం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమని... ప్రార్థనా స్థలాలను చెడగొట్టడం కాదని తెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చయినా వీటిని పునర్నిర్మిస్తామని చెప్పారు. తానే స్వయంగా దేవాలయం, మసీదు నిర్వాహకులతో సమావేశమవుతానని తెలిపారు. మీ అభిప్రాయాల మేరకు వాటి నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు.
KCR
TRS
Secretariat
Temple Masjid

More Telugu News