గడ్డం పెంచేసిన రామ్‌ చరణ్ తేజ్‌.. ఇంట్లో చెమటోడ్చుతూ వ్యాయామం.. ఫొటోలు వైరల్

10-07-2020 Fri 12:25
  • ఫొటోలు పోస్ట్ చేసిన చెర్రీ
  • లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటోన్న హీరో
  • కొత్త లుక్‌లో దర్శనం
Workout Time for MegaPowerStar RamCharan Photos

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటులు ఇంట్లో ఉంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. రామ్ చరణ్ కూడా అలాగే ఇంట్లో వ్యాయామం చేస్తూ చెమటోడ్చుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
                                     
ఇక చెర్రీ కొత్త లుక్‌లో కనపడుతుండడం అభిమానులను ఆకర్షిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆయన గడ్డం బాగా పెంచేశాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో సీతారామరాజుగా నటిస్తోన్న విషయం తెలిసిందే.