Radhe Shyam: 'రాధే శ్యామ్' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్... రిలీజ్ చేయగానే వైరల్!

Prabhas New Movie Radheshyam First Look
  • ప్రభాస్ 20వ చిత్రంగా రాధే శ్యామ్
  • రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
  • ఈ ఉదయం విడుదలైన ఫస్ట్ లుక్
'బాహుబలి' తరువాత గత సంవత్సరం 'సాహో'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి 'రాధే శ్యామ్' అనే టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

పోస్టర్ ను విడుదల చేయగానే అది వైరల్ అయింది. ఈ చిత్రంలో పూజాహెగ్డే, ప్రియదర్శి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా షూటింగ్ జార్జియాలో ముగిసిన తరువాత, ఇంటికి చేరుకున్న యూనిట్ సభ్యులంతా కొన్ని రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అయ్యారు. తదుపరి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులో నిర్వహిస్తారు.

Radhe Shyam
First Look
Prabhas

More Telugu News