సినిమా సెట్లో భౌతిక దూరం పాటించడం అన్నది కష్టం.. జరగదు: బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా

10-07-2020 Fri 09:05
  • ఇప్పటికిప్పుడు షూటింగులను ప్రారంభించాలని అనుకోవడం లేదు
  • సెట్‌లో భౌతిక దూరం పాటిస్తామని చెప్పడం అబద్ధం
  • ఈ పరిస్థితుల్లో షూటింగులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది
Physical distance is a lie in cinema sets

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన సినిమా షూటింగులకు త్వరలోనే అనుమతి ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా స్పందించారు. షూటింగులు ప్రారంభించాలని తానేమీ అనుకోవడం లేదని, సినిమా సెట్లో భౌతిక దూరం పాటించడం అసాధ్యమని, అలా జరగదు, జరగబోదని ఆయన అభిప్రాయపడ్డారు.

షూటింగులు ప్రారంభించినా ఖర్చు తడిసిమోపెడు అవుతుందని, సెట్‌లో నటీనటులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా సెట్‌లో భౌతిక దూరం పాటించడమంటే రెండు పరస్పర విరుద్ధ విషయాలను కలపడమేనని అన్నారు. సెట్‌లో భౌతిక దూరం పాటిస్తామని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని అనుభవ్ సిన్హా తేల్చి చెప్పారు.