కరోనా సోకిన వేళ... బండ్ల గణేశ్ మెనూ ఇదే!

10-07-2020 Fri 08:06
  • 12 రోజులు ఆసుపత్రిలో చికిత్స
  • ఆపై నెగటివ్ రాగా ఇంటికి
  • తాను తీసుకున్న డైట్ ను వివరించిన బండ్ల గణేశ్
Bandla Ganesh Menu in Corona Time

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన 12 రోజుల్లోనే రికవర్ అయి, పూర్తిగా కోలుకున్నారు. ఇక, తాజాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో, కరోనాను తరిమేసేందుకు ఎటువంటి చికిత్స తీసుకున్నదీ వివరించారు.

కరోనాకు ఎటువంటి ట్రీట్ మెంట్ మెంటూ అవసరం లేదని, తీసుకునే డైట్ లో జాగ్రత్తలు పాటిస్తే చాలని వెల్లడించారు. నిత్యమూ కోడిగుడ్డు, శొంఠి, అల్లం, వెల్లుల్లి ఆహారంలో తప్పనిసరని, వేడి నీళ్లు మాత్రమే తాగాలని సలహా ఇచ్చారు. వీటిని ఆహారంలో చేర్చుకుంటే, ఆసుపత్రుల్లో చేరి లక్షలు కట్టాల్సిన అవసరం ఉండబోదని అన్నారు. తాను నిత్యమూ 7 కోడిగుడ్లను తినేవాడినని చెప్పారు. ఈ మెనూతో తనకు రెండు వారాల్లోపే నెగటివ్ వచ్చేసిందని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించారు.