ఏపీ ఈఎస్ఐ కుంభకోణం.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పితాని కుమారుడు

10-07-2020 Fri 07:21
  • పితాని వద్ద అప్పట్లో పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ కూడా..
  • రెండు పిటిషన్లను విచారించి తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు
  • ఏపీలో మరోమారు చర్చనీయాంశం
Pithani suresh filed petition on ap high court for bail

ఏపీ ఈఎస్ఐ కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 9 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కుంభకోణంలో అప్పట్లో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పేరు కూడా వినిపించింది.

తాజాగా, ఈ కేసులో ముందస్తు బెయిలు ఇప్పించాలంటూ ఆయన తనయుడు పితాని సురేశ్ హైకోర్టును ఆశ్రయించడం ఏపీలో ఇప్పుడు మరోమారు చర్చనీయాంశమైంది. అలాగే, పితాని వద్ద అప్పట్లో పీఎస్‌గా పనిచేసిన మురళీ మోహన్ కూడా హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.