POCO: 'పోకో' సరికొత్త మొబైల్ లో భారత్ నిషేధిత చైనా యాప్ లు

  • పోకో ఎం2ను మార్కెట్లోకి విడుదల చేసిన పోకో
  • నిషేధిత హెలో, క్లీన్ మాస్టర్ యాప్ లు ఉన్న వైనం
  • నిషేధం విధించడానికి ముందే వీటిని తయారు చేశామన్న పోకో
POCO new mobiles pre installed with banned china apps

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ పోకో తాజాగా మార్కెట్లోకి 'పోకో ఎం2'ను విడుదల చేసింది. అయితే ఈ యాప్ లో భారత ప్రభుత్వం నిషేధించిన చైనా యాప్ లు ప్రీఇన్స్టాలై ఉండటంతో వినియోగదారులు కలవరపాటుకు గురయ్యారు. హెలో, క్లీన్ మాస్టర్ యాప్ లో ఇందులో ఉన్నాయి. దీనిపై సమీక్షకులు, బ్లాగర్లు సదరు కంపెనీ దృష్టికి  తీసుకెళ్లారు.

ఈ అంశంపై పోకో సంస్థ వెంటనే స్పందించింది. చైనా యాప్ లను భారత్ నిషేధించడానికి ముందే... తమ సాఫ్ట్ వేర్, ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపింది. ఇక నుంచి మార్కెట్లలోకి వచ్చే ఫోన్లలో ఈ యాప్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించింది. నిషేధిత సంస్థలకు సంబంధించిన యూజర్ల డేటాను ఏ సంస్థతోనూ షేర్ చేసుకోబోమని చెప్పింది.

More Telugu News