Ram: రామ్ తాజా చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్

Rams Red gets good offer from OTT players
  • థియేటర్లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన ఓటీటీ 
  • రామ్ నటించిన 'రెడ్'కు 30 కోట్ల ఆఫర్ 
  • థియేటర్లకే మొగ్గు చూపుతున్న నిర్మాతలు   
లాక్ డౌన్ మూలంగా థియేటర్లు మూతబడడంతో, పూర్తయిన సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇలాంటి చిత్రాల నిర్మాతలకు ఓటీటీ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పైగా, ఓటీటీ ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే, చిన్న చిత్రాల నిర్మాతలు కొందరు వీటి పట్ల ఆకర్షితులవుతున్నప్పటికీ, స్టార్ హీరోలతో సినిమాలు తీసిన వాళ్లు మాత్రం వెళ్లడం లేదు.

ఈ క్రమంలో ఎనర్జిటిక్  హీరోగా పేరుతెచ్చుకున్న రామ్ తాజా చిత్రం 'రెడ్'కు కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఓ స్ట్రీమింగ్ సంస్థ నుంచి 25 కోట్ల ఆఫర్ రాగా, తాజాగా మరో సంస్థ నుంచి 30 కోట్ల ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్మాతలు మాత్రం ఓటీటీ వేదికలకు ఇవ్వకూడదని, ఆలస్యమైనా థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

ముఖ్యంగా హీరోలు తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే రిలీజ్ కావాలని కోరుకుంటారు. అందుకే, నిర్మాతలు ముందుగా స్ట్రీమింగ్ కు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదిలావుంచితే, తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'రెడ్' చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత రామ్ నటించిన చిత్రం ఇది.  
Ram
Trumala Kishor
Red
Malavika Sharma

More Telugu News