ఉద్యోగాల పేరుతో యువతులను రప్పించి.. వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్

09-07-2020 Thu 10:24
  • ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల యువతులకు ఎర
  • ఆపై బలవంతంగా వ్యభిచారం
  • పరారీలో ప్రధాన నిందితుడు
Hyderabad police arrest Human trafficking gang

ఉద్యోగాల పేరుతో యువతులను రప్పించి వ్యభిచారంలోకి దింపుతున్న అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాకు హైదరాబాద్ పోలీసులు బేడీలు వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన మిథిలేశ్ శర్మ, రజనీశ్ రంజన్ (24), కర్ణాటకకు చెందిన సుఖేశ్ రావణ్ కాంబ్లే (32)లు కలిసి ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాల యువతులను నగరానికి రప్పించి, యాప్రాల్ లో ఓ ఫ్లాట్ లో వీరితో బలవంతంగా వ్యభిచారం చేయించేవారు. సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఈ నెల 7న వ్యభిచార గృహంపై దాడిచేసి యువతులను రక్షించి రజనీశ్, సుఖేశ్, సాయికిరణ్ (29), సిరాజ్ (27)లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మిథిలేశ్ శర్మ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.