Visakhapatnam District: విశాఖ జిల్లా జి.మాడుగులలో ప్రబలిన అతిసారం.. 76 మంది ఆసుపత్రి పాలు

Diarrhea outbreak in G Madugula in Visakhapatnam dist
  • మాంసాహారం తిని అస్వస్థతకు గురైన గ్రామస్థులు
  • 70 మందిని మాడుగుల, ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించిన అధికారులు
  • గ్రామంలోనే ఉండి పర్యవేక్షణ
విశాఖపట్టణం జిల్లాలోని జి.మాడుగుల మండలంలో అతిసారం ప్రబలి 76 మంది ఆసుపత్రి పాలయ్యారు. మండలంలోని మగతపాలెంలో జరిగిందీ ఘటన. మాంసాహారం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా  విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు 70 మంది బాధితులను మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఆరుగురిని పాడేరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యసిబ్బంది, అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Visakhapatnam District
G.Madugula
diarrhea

More Telugu News