సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

09-07-2020 Thu 07:19
  • వెబ్ సీరీస్ కి ఓకే చెప్పిన పాయల్ 
  • మళ్లీ తండ్రీకొడుకులుగా సూర్య  
  • యువ దర్శకుడితో క్రిష్ సినిమా
Payal Rajputh gives nod for web series

*  హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం వైపు దృష్టి సారిస్తున్నారు. అలా ఇప్పటికే పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో యువ కథానాయిక పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
*  గతంలో రెండు సినిమాలలో తండ్రీ కొడుకులుగా నటించిన తమిళ హీరో సూర్య త్వరలో మళ్లీ అలాంటి పాత్రల్లోనే ద్విపాత్రాభినయం చేయనున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా 'వాడి వాసల్' అనే చిత్రం రూపొందనుంది. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తాడు.
*  ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేసుకుంటున్న ప్రముఖ దర్శకుడు క్రిష్ తన బ్యానర్లో ఓ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇటీవల 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వంలో క్రిష్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.