TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 80 మంది సిబ్బందికి కరోనా

80 persons in TTD got infected to corona virus
  • కరోనా బారినపడుతున్న టీటీడీ సిబ్బంది
  • ప్రతి రోజు 200 మందికి కరోనా పరీక్షలు
  • భక్తుల ద్వారా వైరస్ సోకలేదన్న కలెక్టర్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పటికే 22 వేల మార్కును దాటేసింది. నిన్న ఒక్క రోజే 1,062 మంది వైరస్ బారినపడ్డారు. అలాగే, రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 264కు చేరుకుంది. కాగా, ఇప్పుడు ఈ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది.

టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తాజాగా, కరోనా బారిన పడిన సిబ్బందికి భక్తుల ద్వారా సోకినట్టు ఆధారాలు లేవన్నారు. కాగా, ఇప్పటి వరకు 800 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగటివ్ ఫలితాలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.
TTD
Corona Virus
Tirumala
Tirupati

More Telugu News