Donald Trump: ప్రపంచానికి చైనా చేసిన పని అవమానకరమైనది: ట్రంప్

  • చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం
  • టిక్ టాక్ ను నిషేధించడం అందులో ఒక మార్గం
  • కరోనా అనేది పెద్ద వ్యాపారం
Trump speaks about banning Tik Tok

అమెరికా-చైనాల మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ ను చైనానే పుట్టించిందంటూ ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను నిషేధించే దిశగా యోచిస్తోంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు.

ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కరోనా అనేది పెద్ద వ్యాపారమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికి చైనా చేసిన పని చాలా అవమానకరమైనదని చెప్పారు. టిక్ టాక్ ను నిషేధించే విషయంపై తమ పరిపాలనా విభాగం కసరత్తు చేస్తోందని తెలిపారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటామని... అందులో టిక్ టాక్ ను నిషేధించడం కూడా ఒక మార్గమని చెప్పారు. మరోవైపు, ఇప్పటికే టిక్ టాక్ తో పాటు 59 యాప్ లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.

More Telugu News