వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం పేరుతో డ్రామాలాడుతున్నారు: చంద్రబాబు

08-07-2020 Wed 19:36
  • అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న స్థలం వివాదంలో ఉంది
  • రెండు నెలల తర్వాత గ్యాస్ లీకేజీ ఘటనలో కేసులు పెట్టారు
  • ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
YSRCP is playing games in the name of Ambedkar says Chandrababu

విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలం ఇప్పటికే వివాదంలో ఉందని... దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని చెప్పారు. వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ విగ్రహం పేరిట వైసీపీ నేతలు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత కంపెనీ ప్రతినిధులపై కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. కేసులు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిన విషయమేనని, అయితే కంపెనీని అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇలాంటి దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి విదేశాల్లో ఎంత పరిహారాన్ని ఇస్తారో, ఇక్కడ కూడా అంత ఇవ్వాలని డిమాండ్ చేశారు.