నా సీఎం ఎక్కడ? అంటూ ప్రగతి భవన్ ముందు మెరుపు నిరసనకు దిగిన యువకుడు

08-07-2020 Wed 19:14
  • కేసీఆర్ ఎక్కడున్నారో చెప్పాలంటూ యువకుడి డిమాండ్  
  • ఆయన నా సీఎం అంటూ ప్లకార్డు ప్రదర్శన  
  • పోలీసులు వచ్చే లోపే జారుకున్న యువకుడు
Youth protests out side of Pragathi Bhavan and asked for KCR

 ఈ రోజు ఓ యువకుడు హైదరాబాద్ ప్రగతిభవన్ ఎదుట మెరుపు నిరసనకు దిగాడు. కేసీఆర్ ఎక్కడున్నారో చెప్పాలంటూ ప్రభుత్వ వర్గాలను డిమాండ్ చేశాడు. 'కేసీఆర్ ఎక్కడున్నారు? ఆయన నా సీఎం' అంటూ ఆంగ్లంలో రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ యువకుడు నిష్క్రమించాడు.