Ambedkar: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన జగన్

Jagan inaugurates 125 ft Ambedkar statue
  • విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో విగ్రహ నిర్మాణం
  • క్యాంపు కార్యాలయం నుంచి శంకుస్థాపన చేసిన జగన్
  • విగ్రహ నిర్మాణ స్థలంలో కార్యక్రమానికి హాజరైన మంత్రులు
విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ భారీ విగ్రహానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి విగ్రహం నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. ఇదే సమయంలో స్వరాజ్ మైదాన్ లో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకుస్థాపన ఫలకాన్ని వారు దగ్గరుండి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించనుండటం తమ అదృష్టమని చెప్పారు.
Ambedkar
Statue
Jagan
YSRCP

More Telugu News