ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఓ రేటు ఉంటుందని మోదీ భావిస్తున్నట్టున్నారు: రాహుల్ గాంధీ

08-07-2020 Wed 18:16
  • మోదీపై రాహుల్ విమర్శనాస్త్రాలు
  • సత్యం కోసం పోరాడేవాళ్లను ఎవరూ కొనలేరని వ్యాఖ్యలు
  • మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరంటూ ట్వీట్
Rahul Gandhi criticises Modi

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.  ఈ ప్రపంచమంతా తనలాగే ఉంటుందని మిస్టర్ మోదీ నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో రేటు ఉంటుందని, లేకపోతే వారిని భయపెట్టి దారికి తెచ్చుకోవచ్చని భావిస్తున్నారని ట్వీట్ చేశారు. కానీ, సత్యం కోసం పోరాడేవాళ్లను ఎవరూ కొనలేరని, వారిని ఎవరూ భయపెట్టలేరన్న విషయాన్ని మోదీ ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొన్నారు.