Sharad Pawar: అందులో సర్‌ప్రైజ్‌ ఏముంది?: మోదీ లడఖ్‌ పర్యటనపై శరద్‌ పవార్‌

Not Surprised   Sharad Pawar On PMs Ladakh Visit
  • గతంలో నెహ్రూ కూడా ఇలాగే పర్యటించారు కదా?
  • రక్షణ శాఖ మంత్రి యశ్వంత్‌రావ్ చవాన్‌ కూడా ఆ పనిచేశారు
  • నేను రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చైనాలో పర్యటించాను 
  • సరిహద్దుల వద్ద ఆయుధాలు వాడొద్దన్న ఒప్పందం కుదిరింది
లడఖ్‌లో ఇటీవల పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారంటూ వస్తోన్న ప్రచారంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ స్పందించారు. ఇందులో సర్‌ప్రైజ్‌ ఏముందని, గతంలో నెహ్రూ కూడా ఇలాగే పర్యటించారు కదా? అని ప్రశ్నించారు.

'1962లో చైనాతో యుద్ధం జరిగిన సమయంలోనూ ఆ ప్రాంతంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ పర్యటించారు. అంతేగాక, రక్షణ శాఖ మంత్రి యశ్వంత్‌రావ్ చవాన్‌ కూడా అలాగే వెళ్లారు' అని చెప్పారు.

1962లో చైనా చేతిలో భారత్‌ ఓడిపోయిందని, అయినప్పటికీ వారిద్దరి పర్యటన భారత సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని శరద్‌ పవార్‌ చెప్పారు. దేశానికి నాయకత్వం వహిస్తోన్న వారు సైనికులను కలవడంలో సర్‌ప్రైజ్‌ ఏముంటుందని అన్నారు.

తాను 1993లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చైనాలో పర్యటించానని, సరిహద్దుల వద్ద ఆయుధాలు వాడొద్దంటూ ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయని శరద్‌ పవార్‌ చెప్పారు. అప్పట్లోనూ ప్రతిష్టంభన నెలకొనగా ఒప్పందం అనంతరం ఇరు దేశాల సైన్యం అక్కడి నుంచి వెనక్కి వెళ్లాయని చెప్పారు. చైనాతో నెలకొన్న సమస్యను దౌత్యపర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అంతర్జాతీయంగా చైనాపై ఒత్తిడి తీసుకురావాలని అప్పట్లోనే తాను చెప్పానని అన్నారు.
Sharad Pawar
Ladakh
Galwan Valley
Narendra Modi

More Telugu News