మా బావ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి: మోహన్ బాబు

08-07-2020 Wed 11:40
  • వైఎస్సార్ స్నేహశీలి అంటూ మోహన్ బాబు ట్వీట్
  • పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం అంటూ వ్యాఖ్యలు
  • ఆయన దీవెనలు తమకుండాలని ఆకాంక్ష
Mohanbabu pays tributes to YS Rajasekhar Reddy

ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. వైఎస్సార్ స్నేహశీలి అని కొనియాడారు. మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు వైఎస్సార్ నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు."పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నా" అంటూ మోహన్ బాబు స్పందించారు.