TikTok: హాంకాంగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన టిక్ టాక్.. భారత్ నిషేధంతో ఇప్పటికే భారీ నష్టం!

  • చైనా పట్ల హాంకాంగ్ లో తీవ్ర వ్యతిరేకత
  • తాజా నిర్ణయంతో 1.50 లక్షల మంది యూజర్లను కోల్పోనున్న టిక్ టాక్
  • టిక్ టాక్ ను బ్యాన్ చేసే యోచనలో అమెరికా
Tik Tok to exit from Hong Kong

చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్ టాక్ కు భవిష్యత్తు ఆందోళనకరంగానే ఉండేట్టు ఉంది. ఈ యాప్ ను ఇప్పటికే భారత్ బ్యాన్ చేసింది. దీంతో, కోట్లాది మంది వినియోగదారులున్న అతి పెద్ద భారత మార్కెట్ ను అది కోల్పోయింది. మరోవైపు, టిక్ టాక్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రకటించారు.

తాజాగా టిక్ టాక్ కీలక ప్రకటన చేసింది. హాంకాంగ్ నుంచి వైదొలగబోతున్నట్టు ఈరోజు ప్రకటించింది. అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులే దీనికి కారణం. హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ చైనా పార్లమెంటు ఇటీవల జాతీయ భద్రతా చట్టానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో హాంకాంగ్ ప్రజలు చైనా పట్ట తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.

తాజా నిర్ణయంతో టిక్ టాక్ హాంకాంగ్ లో 1.50 లక్షల మంది యూజర్లను కోల్పోనుంది. భారత్ విధించిన నిషేధంతో టిక్ టాక్ ఇప్పటికే 6 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకున్నట్టు అంచనా వేస్తున్నారు.

More Telugu News