Jhansi: దయచేసి వాస్తవాలను తెలుసుకుని వార్తలను రాయండి: యాంకర్ ఝాన్సీ

  • కరోనా బారిన పడుతున్న బుల్లితెర ప్రముఖులు
  • తనకు కరోనా సోకలేదని వివరణ ఇచ్చిన ఝాన్సీ
  • తాను ఐసొలేషన్ లో ఉన్నానని వ్యాఖ్య
Dont write news without confirmation says Jhansi

తెలుగు బుల్లి తెరపై కరోనా వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు మరోవైపు కరోనా సోకిందంటూ పలువురిపై పుకార్లు కూడా వస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ యాంకర్ ఓంకార్ కు కరోనా సోకిందనే వార్త వైరల్ అయింది. దీంతో, అలాంటిదేమీ లేదని ఆయన కుటుంబం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా యాంకర్ ఝాన్సీకి కరోనా వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఝాన్సీ స్పందిస్తూ, ఇవన్నీ రూమర్లేనని చెప్పింది.

తనతో పాటు పని చేసే ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలిందని... దీంతో తాను ఐసొలేషన్ లో ఉండిపోయానని చెప్పింది. ఇప్పటికే ఏడు రోజుల ఇంక్యుబేషన్ పూర్తయిందని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్పింది. వాస్తవాలను చెక్ చేసుకొని వార్తలు రాయాలని మీడియాను, యూట్యూబ్ ఛానల్స్ ను కోరుతున్నానని తెలిపింది. ఈ మేరకు ఆమె ఒక వీడియోను విడుదల చేసింది.

More Telugu News