వరుసగా ఐదో రోజు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

07-07-2020 Tue 16:08
  • 187 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • భారీ లాభాలను మూటగట్టుకున్న బ్యాంకింగ్ స్టాకులు
Markets ends in profits for straight fiftsh day

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలను ఆర్జించాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ స్టాకుల అండతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 36,675కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 10,800 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (7.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.10%), ఇన్పోసిస్ (4.01%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.84%), యాక్సిస్ బ్యాంక్ (3.09%) .

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.03%), ఎన్టీపీసీ (-2.78%), ఐటీసీ లిమిటెడ్ (-2.73%), టాటా స్టీల్ (-2.26%), ఓఎన్జీసీ (-2.15%).