తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కల్యాణ్
- జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్
- సాలిగం శ్రీనివాస్ అనే జవాను వీరమరణం
- శ్రీనివాస్ మృతి దురదృష్టకరం అని పేర్కొన్న పవన్
చైనా సరిహద్దులో జరిగిన పోరాటంలో సంతోష్ బాబు అనే వీరుడ్ని కోల్పోయిన కొద్దిరోజుల వ్యవధిలోనే తెలంగాణ శ్రీనివాస్ ను కూడా కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. బాధాతప్త హృదయంతో నివాళి అర్పిస్తున్నట్టు వివరించారు. సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్న విధంగానే కేసీఆర్ సర్కారు ఇప్పుడు శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.