ఎన్టీఆర్ సినిమాలో విలన్ క్యారెక్టర్.. క్లారిటీ ఇచ్చిన మనోజ్

07-07-2020 Tue 12:18
  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా
  • మనోజ్ విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడంటూ వార్తలు
  • ఈ వార్తల్లో నిజం లేదన్న మనోజ్
Manchu Manoj gives clarity on villain character in Junior NTRs movie

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడనేదే ఆ వార్త. ఈ అంశంపై మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశాడు. విలన్ క్యారెక్టర్లు చేయడానికి తాను వ్యతిరేకం కాదని... అయితే, ఇప్పటికిప్పుడే విలన్ క్యారెక్టర్లు చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు.

జూనియర్ ఎన్టీఆర్ తో మనోజ్ కు ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాను మనోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, తానే సొంతంగా నిర్మిస్తున్నాడు.