వర్మకు షాకిచ్చిన 'పవర్ స్టార్' పాత్రధారి... సినిమా ఆగిపోయినట్టే!

07-07-2020 Tue 08:03
  • ఇటీవల కొత్త సినిమాను ప్రకటించిన వర్మ
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి
  • తాను ఆ పాత్రను చేయలేనన్న నటుడు
Power star Movie Stopped by Varma

తాను 'పవర్ స్టార్' పేరిట ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ సినీ నటుడి కల్పిత కథతో సినిమా చేస్తున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రకటన టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన చిత్రంలో హీరో ఇతనేనంటూ, పవన్ కల్యాణ్ పోలికలతో కనిపించే ఓ వ్యక్తి వీడియోను కూడా వర్మ విడుదల చేయగా, అది వైరల్ అయింది.

ఇక తాజా సమాచారం ప్రకారం, పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడితో 'పవర్ స్టార్' హీరో వర్మకు హ్యాండిచ్చాడట. ఆ పాత్రను తాను చేయలేనని అతను స్పష్టం చేయడంతో వర్మ ఈ సినిమాను పక్కన పడేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు పవన్ లా కనిపించే మరో వ్యక్తిని తీసుకుని రావడం చాలా కష్టమని వర్మ భావించారట. ఈ విషయంలో వర్మ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.