ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానానికి మరోసారి గడువు పెంపు

06-07-2020 Mon 20:28
  • గతంలో విధించిన గడువు జూన్ 30తో ముగిసిన వైనం
  • 2021 మార్చి 31 వరకు తాజా గడువు
  • ఈ నిర్ణయం ప్రజలకు ఉపకరిస్తుందన్న ఐటీ శాఖ
IT Department extended PAN and Aadhar link deadline

విస్తృతస్థాయిలో ఆర్థిక లావాదేవీలకు ఉపకరించే శాశ్వత ఖాతా నెంబరు (పాన్)కు ఆధార్ కార్డును అనుసంధానించేందుకు గడువును కేంద్రం మరోసారి పెంచింది. గతంలో పొడిగించిన గడువు జూన్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో, ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పెంచుతున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ పెంపు నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితులు మెరుగుపర్చుకునేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు ఐటీ శాఖ ట్వీట్ చేసింది.