Sumalatha: ప్రముఖ సినీ నటి సుమలతకు కరోనా పాజిటివ్

Sumalatha tested corona positive
  • శనివారం నుంచి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న సుమలత
  • ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న సుమలత
  • తనను కలిసిన వాళ్లు కూడా టెస్టు చేయించుకోవాలని సూచన
ప్రముఖ నటి, లోక్ సభ సభ్యురాలు సుమలత కరోనా బారినపడ్డారు. శనివారం నాడు తనకు స్వల్పంగా తలనొప్పి, గొంతులో అసౌకర్యం వంటి లక్షణాలు కనిపించాయని, దాంతో కరోనా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఓ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున ఇటీవల తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించానని, ఆ సమయంలోనే కరోనా సోకి ఉంటుందని సుమలత ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా, తనకు కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున హోం క్వారంటైన్ విధించారని, అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్నానని, వైద్యుల సూచనల ఆధారంగా ఔషధాలు వాడుతున్నానని వివరించారు.

భగవంతుడి అనుగ్రహం వల్ల తనలో వ్యాధి నిరోధక శక్తి మెరుగైన స్థాయిలో ఉందని, అభిమానులందరి మద్దతుతో త్వరలోనే కోలుకోగలనన్న ఆత్మవిశ్వాసం తనకుందని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు కలిసిన వారందరి వివరాలు అధికారులకు వెల్లడించానని సుమలత పేర్కొన్నారు. ఇంకా ఎవరినైనా తాను కలిసినట్టయితే, వారిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా జయించగలం అంటూ ట్వీట్ చేశారు.
Sumalatha
Corona Virus
Positive
Mandya
MP
Karnataka

More Telugu News