అర్ధరాత్రి ఈటలకు ఫోన్ చేసిన కరోనా బాధితుడు... పీఏని అలర్ట్ చేసి ప్రాణం కాపాడిన మంత్రి
- ఊపిరి ఆడడంలేదంటూ ఈటలకు తెలిపిన యువకుడు
- వెంటనే తన పీఏని అప్రమత్తం చేసిన ఈటల
- అంబులెన్స్ ద్వారా యువకుడ్ని ఆసుపత్రికి తరలింపు
అయినప్పటికీ ఏమాత్రం విసుక్కోకుండా ఈటల మానవతా దృక్పథంతో స్పందించి తన పీఏని అప్రమత్తం చేశారు. ఆ యువకుడు ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ పంపించి, అతడిని ఆసుపత్రికి తరలించారు. తద్వారా అతడి ప్రాణాలు కాపాడగలిగారు. ఆసుపత్రి బెడ్ పై నుంచి ఆ యువకుడు ఓ వీడియోలో మాట్లాడుతూ మంత్రి ఈటలను దేవుడిగా అభివర్ణించాడు. రాత్రనక, పగలనక శ్రమిస్తున్నారంటూ పేర్కొన్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రఫీ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ నెంబర్ ను ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాడట.