రేపు సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన.. పాల్గొనే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టు!
- రేపు, ఎల్లుండి సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటన
- ఇడుపులపాయ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
- పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్
ఎస్పీ వెల్లడించిన ఇతర వివరాలు ఇవే..
- సీఎం జగన్ ఈ నెల 7 మంగళవారం సాయంత్రం 4.55 గంటలకు ఇడుపులపాయ వస్తారు.
- వీరన్నగట్టుపల్లె క్రాస్ నుంచి ఏడు చెక్ పోస్టుల ఏర్పాటు.
- హెలిప్యాడ్ కు కొంచెం దూరంలో రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్ల ఏర్పాటు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు బారికేడ్ల వరకే అనుమతి. అది కూడా 36 మందికే అనుమతి.
- ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు సీఎం కుటుంబ సభ్యులు, వీఐపీలకే అనుమతి.
- ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ తరగతి గదుల ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన ఉంటుంది. ఈ కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు అనుమతి. బయటి నుంచి వచ్చిన వారికి అనుమతి ఉండదు.