విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఒక డమ్మీ: భట్టి విక్రమార్క

06-07-2020 Mon 14:45
  • లాక్ డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు విపరీతంగా వచ్చాయి
  • అడుగుదామంటే సీఎం అందుబాటులో లేరు
  • కేసీఆర్ కు సేవ చేయడమొక్కటే జగదీశ్ రెడ్డికి తెలుసు
Minister Jagadish Reddy is a dummy says Bhatti Vikramarka

రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కనపడకుండా ఉన్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలో కరెంట్ బిల్లులు విపరీతంగా వచ్చాయని.. విద్యుత్ బిల్లులను తగ్గించాలని అడుగుదామన్నా ముఖ్యమంత్రి అందుబాటులో లేరని విమర్శించారు. అధికారుల ద్వారా అ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ డమ్మీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు సేవ చేయడమొక్కటే జగదీశ్ రెడ్డికి  తెలిసిన విద్య అని దుయ్యబట్టారు. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సి వస్తుందని అన్నారు.