Pranita: తెలుగు హీరోలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన కన్నడ భామ ప్రణీత

Actress Pranitas opinion on Tollywood Heroes
  • టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ అంటే ఇష్టం
  • మహేశ్ బాబు అందగాడు
  • జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్
సినీ పరిశ్రమలో మంచి మనసు ఉన్న అతి కొద్ది మందిలో సినీ నటి ప్రణీత ఒకరు. కరోనా కష్ట కాలంలో తిండి లేక అలమటిస్తున్న వారికి స్వయంగా వంట వండి భోజనం అందించిన గొప్ప మనను  ఆమెది. ప్రణీతది కర్ణాటక అయినప్పటికీ... టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. తాజాగా ట్విట్టర్ లో ఆమె తన అభిమానులతో ముచ్చటిస్తూ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. తమిళంలో హీరో అజిత్ అంటే తనకు ఎంతో ఇష్టమని... తమిళ భాష తనకు అర్థం కాకపోయినా ఆయన నటించే సినిమాలన్నీ చూస్తుంటానని చెప్పింది.

టాలీవుడ్ విషయానికి వస్తే... పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రణీత తెలిపింది. ఇతర హీరోల విషయానికి వస్తే...  మహేశ్ బాబు అందగాడని, ప్రభాస్ సూపర్ స్టార్ అని, జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ అని చెప్పింది. డ్యాన్స్ లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఇద్దరేనని కితాబిచ్చింది. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది.
Pranita
Tollywood

More Telugu News