Piyush Goyal: ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్‌లో, సగం మహారాష్ట్రలో ఉంది: ఫొటో పోస్ట్ చేసిన పీయూష్ గోయల్

  • రెండు రాష్ట్రాల్లో కలిపి ఉన్న ఒకే  స్టేషన్ 
  • ఇది నవాపూర్ రైల్వే స్టేషన్
  • సూరత్‌, భుసావల్ మార్గంలో ఉంటుంది 
piyush tweets narapur railway station pic

భారత్‌లో రెండు రాష్ట్రాల్లో కలిసి ఉన్న ఒకే రైల్వేస్టేషన్ గురించిన వివరాలు గుర్తు చేస్తూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేశారు. ‘దేశంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ఒకే రైల్వేస్టేషన్ గురించి మీకు తెలుసా? ఇది నవాపూర్ రైల్వే స్టేషన్.. సూరత్‌, భుసావల్ మార్గంలో ఇది ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ సగం గుజరాత్‌లో ఉండగా, సగం మహారాష్ట్రలో ఉంది. ఆయా రాష్ట్రాల సరిహద్దులు ఈ రైల్వే స్టేషన్ మధ్య నుంచి ఉంటాయి' అని ఆయన వివరించారు.

కాగా, భారత్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లో రైల్వేకు సంబంధించిన ఇటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. కాగా, నవాపూర్ రైల్వే స్టేషన్‌ మాత్రమే కాకుండా దేశంలోని భవానీ మండి రైల్వే స్టేషన్ కూడా రెండు రాష్ట్రాల (మధ్యప్రదేశ్-రాజస్థాన్‌) భూభాగంలోనూ ఉంటుంది.

More Telugu News