సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- శర్వానంద్ చిత్రంలో రాశిఖన్నా
- 'సీటీమార్'లో సునీల్ కామెడీ రోల్
- వచ్చే నెల నుంచి ఫిలిం సిటీలో 'లవ్ స్టోరీ'
* గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రంలో ప్రముఖ హాస్య నటుడు సునీల్ మంచి కామెడీ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఆయన కబడ్డీ కోచ్ కి అసిస్టెంట్ గా హాస్యభరిత పాత్రలో కనిపిస్తాడట. ఇక ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా 'లవ్ స్టోరీ' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షూటింగును వచ్చే నెల నుంచి రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.