Corona Virus: హైదరాబాద్‌లో దారుణం.. ఫీవర్‌ ఆసుపత్రి మహిళా డీఎంవోను నిర్బంధించిన ప్రైవేటు ఆసుపత్రి.. వీడియో ఇదిగో

Fever Hospital dmo  In Private Hospital Due To Corona video goes viral
షార్ట్స్‌లో చూడండి
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వైరస్‌ లక్షణాలతో వచ్చిన వారి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. ఇప్పటికే ఇటువంటి పలు ఘటనలు దేశ వ్యాప్తంగా పలు చోట్ల బయట పడ్డాయి. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తాజాగా ఇలాంటి దారుణమే వెలుగులోకి వచ్చింది.

తనను హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లోని తుంబై ఆసుపత్రిలో నిర్బంధించారంటూ హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రి డీఎంవో సుల్తానా ఓ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలతో తాను ఈ ఆసుపత్రిలో చేరానని, అయితే, 24 గంటలకు రూ.1.15 లక్షల బిల్లు వేశారని సెల్ఫీ వీడియోలో ఆమె కన్నీరు కార్చుతూ తెలిపారు. అంత బిల్లు ఎందుకని అడిగినందుకు ఆ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  
                   
Go Back to Shorts
Corona Virus
COVID-19
Viral Videos

More Telugu News