సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. ఈఐడీ పేల్చిన ఉగ్రవాదులు

05-07-2020 Sun 09:07
  • ఒక జవానుకు గాయాలు
  • పక్కా వ్యూహంతో బాంబు పేల్చిన ఉగ్రవాదులు
  • కొనసాగుతున్న వేట
CRPF Convoy Has been Attacked by Terrorists

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. గంగూ ప్రాంతంలో ఈ ఉదయం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కాన్వాయ్‌పై దాడికి దిగారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈఐడీని పేల్చారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. దాడితో అప్రమత్తమైన బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులపై కాల్పులు ప్రారంభించాయి. ఈఐడీ పేల్చిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు.