Police: మహారాష్ట్ర పోలీసుల శాఖలో భయంభయం.. కొత్తగా 237 మంది పోలీసులకు కరోనా

Maharashtra police personnel infected to corona virus
  • వరుసపెట్టి కరోనా బారినపడుతున్న పోలీసులు
  • ఇప్పటి వరకు 1,040 మందికి కరోనా పాజిటివ్
  • 64 మంది పోలీసుల మృతి
మహారాష్ట్ర పోలీసు శాఖను కరోనా భయపెడుతోంది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వందల సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా, గత 72 గంటల వ్యవధిలో 237 మంది పోలీసులు కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,040 మంది పోలీసులు కరోనా బాధితులుగా మారారు. అలాగే, ఇప్పటి వరకు 64 మంది పోలీసులు కరోనాతో మృతి చెందారు. పోలీసులు వరుసపెట్టి కరోనా బారినపడుతుండడంతో విధులకు వెళ్లేందుకు పోలీసులు వణుకుతున్నారు.
Police
Maharashtra
Corona Virus

More Telugu News