కరోనా దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికా

05-07-2020 Sun 08:04
  • 24 గంటల్లో 57 వేలకు పైగా కేసులు.. 728 మంది మృతి
  • 29 లక్షలు దాటేసిన కేసుల సంఖ్య
  • సాదాసీదాగా స్వాతంత్ర్య వేడుకలు
America Shivering with Coronavirus

కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 57,683 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే తొలిసారి. అలాగే, 728 మంది కరోనాతో మృతి చెందారు.

తాజా కేసులతో కలుపుకుని అమెరికా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 29,12,166కు చేరుకోగా, 1,32,196 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నేపథ్యంలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సాదాసీదాగా ముగిసింది. జనం ఇళ్లలోనే ఉండి వేడుకలు జరుపుకున్నారు. కొన్ని చోట్ల మాత్రం భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకున్నారు.