Hyderabad: ఎల్లుండి నుంచి నిమ్స్‌లో ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

Covaxin Clinical Trials Starts Soon In NIMS
  • కోవాగ్జిన్ ప్రయోగాలకు సిద్ధమైన నిమ్స్
  • నిధులు విడుదల చేసిన ఐసీఎంఆర్
  • గతంలో పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన నిమ్స్
ఈ నెల ఏడో తేదీ నుంచి హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను మానవులపై ప్రయోగానికి దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులను ఎంపిక చేశారు. అందులో నిమ్స్ కూడా ఒకటి. నిమ్స్‌లో గతంలో పలు క్లినికల్ ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో కోవాగ్జిన్ ఫేజ్ 1 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. క్లినికల్ ప్రయోగాల కోసం ఐసీఎంఆర్ బడ్జెట్ విడుదల చేసినట్టు చెప్పారు.

టీకా ప్రయోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైందని, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఐసీఎంఆర్‌కు నివేదించనున్నట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే టీకా ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు డాక్టర్ మనోహర్ తెలిపారు.
Hyderabad
NIMS
COVAXIN
Clinical Trials

More Telugu News