Innovation Challenge: చైనా యాప్ లకు దీటుగా దేశీయ యాప్ ల రూపకల్పన కోసం ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించిన కేంద్రం

  • సరికొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం
  • దేశీయ అవసరాలకు తగిన యాప్ లకు బహుమతులు
  • జూలై 18 తుదిగడువు
Centre announces innovation challenge to make and develop new apps

చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే చైనాకు చెందిన 59 యాప్ లను నిషేధించింది. తాజాగా, ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా దేశీయంగా యాప్ ల రూపకల్పన, అభివృద్ధి అంశాల్లో ఇన్నొవేషన్ చాలెంజ్ ప్రకటించింది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ట్రాక్-1, ట్రాక్-2 అంటూ విభజించారు.

ఇప్పటికే దేశీయంగా వాడుకలో ఉన్న యాప్ ల కోసం ట్రాక్-1, దేశంలో కొత్త యాప్ లు రూపొందించగల సత్తా ఉన్న ఔత్సాహికుల కోసం ట్రాక్-2 చాలెంజ్ ను ప్రకటించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, సోషల్ మీడియా, ఈ-లెర్నింగ్, క్రీడలు, వార్తలు, ఆర్థిక సాంకేతికత, అగ్రిటెక్, హెల్త్, వినోదం, ఆఫీస్ ప్రొడక్టివిటి అంశాల్లో యాప్ లు రూపొందించాల్సి ఉంటుంది.

ట్రాక్-1, ట్రాక్-2 రెండు విభాగాల్లో మూడేసి బహుమతులు ఇవ్వనున్నారు. ఫస్ట్ ప్రైజ్ రూ.20 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ.15 లక్షలు, మూడో బహుమతి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు. ఇతర విభాగాల్లోనూ మరికొన్ని బహుమతులు ఉన్నాయి. నీతి ఆయోగ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఈ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ చాలెంజ్ ను నిర్వహిస్తున్నాయి. జూలై 4 నుంచి చాలెంజ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 18 లోపు ఆన్ లైన్ లో వివరాలు సమర్పించాలి.

More Telugu News