ప్రణయ్ హత్యోదంతంపై సినిమా.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

04-07-2020 Sat 17:59
  • 'మర్డర్' సినిమాను తెరకెక్కిస్తున్న రామ్ గోపాల్ వర్మ
  • అమృత, మారుతీరావు కథనంతో తెరకెక్కుతున్న సినిమా
  • ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేసిన ప్రణయ్ తండ్రి
Case registered on Ram Gopal Verma

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. అమృత, మారుతీరావు, ప్రణయ్ నిజ జీవిత కథతో  'మర్డర్' అనే చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అమృత మామ, ప్రణయ్ తండ్రి బాలస్వామి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సినిమా తన కుమారుడి హత్య కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ చిత్రాన్ని నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా... వర్మ సమర్పకుడిగా వున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.