Manikyala Rao: మాజీమంత్రి మాణిక్యాలరావుకు కరోనా పాజిటివ్

Former minister Manikyala Rao tested corona positive
  • స్వయంగా వెల్లడించిన బీజేపీ నేత
  • కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదని వెల్లడి
  • భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచన
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదని, రాకూడని జబ్బుగా భావించరాదని పేర్కొన్నారు. కార్లు, బస్సులు, ఇతర వాహనాల్లో భౌతికదూరం పాటించకపోతే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. వైరస్ భయంతో టెస్టులు చేయించుకోవడం మానుకోవద్దని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ఇదేమంత ప్రమాదకరమైన వ్యాధి కాదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా సందేశం అందించారు.
Manikyala Rao
Corona Virus
Positive
Former Minister
BJP
Andhra Pradesh

More Telugu News