నేడు అల్లూరి సీతారామరాజు జయంతి.. ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించిన ప్రముఖులు

04-07-2020 Sat 16:08
  • నేడు అల్లూరి సీతారామరాజు జయంతి
  • నివాళులు అర్పించిన సీఎం జగన్
  • అల్లూరి త్యాగం తెలుగుజాతికి గొప్పగౌరవం అని వెల్లడి
 CM Jagan and Chandrababu pays tributes for Alluri Sitharama Raju

సాటి జనులను దాస్య శృంఖలాల నుంచి విముక్తుల్ని చేసేందుకు బ్రిటీష్ వాళ్లకు ఎదురొడ్డి పోరాడిన తెలుగుతేజం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. మన్యం వీరుడి జయంతి సందర్భంగా నివాళులు అంటూ ట్వీట్ చేశారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు అంటూ కీర్తించారు. అల్లూరి త్యాగం తెలుగుజాతికే గొప్ప గౌరవం అంటూ కొనియాడారు.

మరోపక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి, బీజేపీ జాతీయ నేత సునీల్ దేవధర్, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, ఎమ్మెల్యే రోజా తదితరులు కూడా తమ ట్వీట్ల ద్వారా అల్లూరికి నివాళులు అర్పించారు.