పంట పొలాల్లో ఉచితంగా బోర్లు... రైతులకు ఏపీ సర్కారు తియ్యటి కబురు
- 5 ఎకరాల లోపు పొలం ఉన్నవారికి శుభవార్త
- గ్రామసచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే ఉచిత బోరు
- పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు నకళ్లు సమర్పిస్తే చాలు
కాగా, ఈ పథకం కింద లబ్ది పొందాలనుకునేవారికి కొన్ని విధివిధానాలు, అర్హతలు రూపొందించారు. రైతుకు కనీసం రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండాలి. ఒకవేళ తానొక్కడికే అంత భూమి లేకపోతే, తన పొలం పక్కనున్న రైతులతో కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్పటికే బోర్లు ఉన్న పొలాలను ఈ ఉచిత పథకం నుంచి మినహాయించారు.


