Devineni Uma: కొల్లు రవీంద్ర ఈ కేసు నుంచి అగ్నిపునీతుడై బయటికి వస్తాడు: దేవినేని ఉమ

  • మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్
  • కక్ష సాధిస్తున్నారంటూ దేవినేని ఉమ ఆగ్రహం
  • రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కువకాలం నడవదంటూ వ్యాఖ్యలు
Devineni Uma responds over Kollu Ravindra arrest

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మోకా భాస్కరరావు హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంపై పార్టీ సహచరుడు దేవినేని ఉమ స్పందించారు. కొల్లు రవీంద్రపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన బడుగు, బలహీన వర్గాల నేత కొల్లు రవీంద్రను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే హత్యకేసులో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఓ పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారని, కొల్లు రవీంద్రను జైల్లో పెట్టినా గానీ, ఆయన అగ్నిపునీతుడై ఈ కేసు నుంచి బయటికి వస్తాడని తెలిపారు.

ఐదు రోజుల కిందట హత్య జరిగితే, కొల్లు రవీంద్ర పేరును ఆలస్యంగా ఎఫ్ఐఆర్ లో చేర్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం ఎక్కువకాలం నడవదని సీఎం జగన్ తెలుసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. రాజధానిలో కోట్ల రూపాయలతో రాజప్రాసాదం కట్టుకుని, ఏమాత్రం బాధ్యత లేకుండా పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారంటూ సీఎం జగన ను విమర్శించారు.

More Telugu News