mask: రూ.2.90 లక్షల బంగారంతో ఫేస్ మాస్కు చేయించుకున్న వ్యక్తి.. ఫొటో వైరల్

This is what you do when you have more money than sense
  • పూణేలో ఘటన
  • బంగారపు మాస్కు ధరించిన  పింప్రి-చింద్వాడ్ వాసి శంకర్
  • శ్వాస తీసుకోవడానికి ఆ మాస్కులకు చిన్న చిన్న రంధ్రాలు

కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ మాస్కులు ధరిస్తోన్న విషయం తెలిసిందే. ఎంతటి ధనవంతుడైనా కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించాల్సిందే. అయితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ ధనవంతుడు మాత్రం బంగారంతో మాస్కు చేయించుకుని వార్తల్లో నిలిచాడు. ఇందుకోసం రూ.2.90 లక్షలు ఖర్చు చేశాడు. శ్వాస తీసుకోవడానికి ఆ మాస్కులకు చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి.

 కాగా, బంగారంతో మాస్కు చేయించుకున్న ఆయన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫొటోను పోస్ట్ చేసిన జమ్మూకశ్మీర్ రాజకీయ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు గప్పించారు. జ్ఞానం కంటే డబ్బు ఎక్కువగా ఉంటే ఇటువంటి పనులే చేస్తారని చురకలంటించారు.

  • Loading...

More Telugu News