టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డిని విచారిస్తున్న సీబీఐ

04-07-2020 Sat 13:37
  • జీవీకే నిధుల గోల్ మాల్ కేసులో వెలుగు చూస్తున్న కొత్త కోణాలు
  • పింకీరెడ్డి కంపెనీలోని నిధుల మళ్లింపు
  • జీవీకే, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని విచారిస్తున్న సీబీఐ
CBI investigating Pinky Reddy

జీవీకే సంస్థ నిర్వహణలో ఉన్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ లో నిధుల గోల్ మాల్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ అథారిటి అభివృద్ధికి కేటాయించిన నిధులతో నవీ ముంబై పరిసరాల్లో జీవీకే గ్రూప్ రియలెస్టేట్ వ్యాపారం చేసినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు ఉద్యోగుల జీతాలకు ఈ నిధులను ఉపయోగించినట్టు గుర్తించింది.

మరోవైపు, ఈ కేసులో పింకీ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. పింకీరెడ్డి ట్రావెల్స్ కంపెనీలోకి కూడా నిధులు మళ్లినట్టు ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. మొత్తం రూ. 750 కోట్ల నిధులు మళ్లించినట్టు నమోదైన ఈ కేసులో జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, పింకీరెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పింకీరెడ్డి రాజకీయవేత్త, సినీనిర్మాత టి.సుబ్బరామిరెడ్డి కుమార్తె అనే విషయం గమనార్హం.