గుంటూరు బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో ఇద్దరి అరెస్ట్

04-07-2020 Sat 10:08
  • ‘మై నేమ్ ఈజ్ 420’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలు అప్‌లోడ్
  • తనకు అందిన ఫొటోలను మరో నలుగురికి పంపిన యువకుడు
  • ముగ్గురి కోసం కొనసాగుతున్న వేట
Another Two persons arrested in Guntur Btech student case

గుంటూరులో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో ఇప్పటికే ప్రధాన సూత్రధారి వరుణ్‌తోపాటు వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కౌశిక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే, ‘మై నేమ్ ఈజ్ 420’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫొటోలను అప్‌లోడ్ చేసిన యువకుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన యువకుడు వాటిని మరో నలుగురికి పంపినట్టు సమాచారం. దీంతో డెల్టా ప్రాంతానికి చెందిన విద్యార్థితోపాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫొటోలు అందుకున్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.